సంస్థ తీరుతెన్నులు

భార‌త విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) ప్ర‌ధాన కార్యాల‌యం (HQ) న్యూఢిల్లీలో ఉండ‌గా వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతా (UT)ల‌కు సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ కార్యాల‌యాలున్నాయి(RO). UIDAIకి రెండు స‌మాచార కేంద్రాలుండ‌గా వీటిలో ఒక‌టి కర్ణాట‌క‌లోని హెబ్బ‌ళ్ (బెంగ‌ళూరు)లోనూ, మ‌రొక‌టి హ‌ర్యానాలోని మ‌నేస‌ర్ (గూడ్‌గావ్‌)లోనూ ఉన్నాయి.

అథారిటీ స్వభావ స్వరూపాలు

అథారిటీ లో పార్ట్-టైం పద్దతిలో పని చేయుచున్న ఒక చైర్మన్ మరియు ఇద్దరు పార్ట్-టైం సభ్యులు వుండి, ఒక మెంబర్ సెక్రటరీ చీఫ్-ఎక్షుక్యుటివ్ ఆఫీసర్ గా వ్యవయరిస్తారు

శ్రీ.జే.సత్యనారాయణ,ఐ.ఎ.ఎస్(విశ్రాంతి),(1977,ఎ.పి కేడర్) పార్ట్-టైం పద్దతిలో చైర్మన్ గా పని చేయుచున్నారు.

శ్రీ.రాజేష్ జైన్ , వ్యవస్తాపకులు & మానజింగ్ డైరెక్టర్ ,నెట్ కోర్ సోలుషన్స్ మరియు డా.ఆనంద్ దేశ్ పాండే, వ్యవస్తాపకులు, చైర్మన్ & మానజింగ్ డైరెక్టర్, పెర్సిటెంట్ సిస్టంస్ వారు అథారిటీ పార్ట్-టైం సభ్యులుగా వున్నారు

యు.ఐ.డి.ఎ.ఐకు ముఖ్య కార్య నిర్వహణాధికారిగా(C.E.O)గా డాక్టర్ అజయ్ భూషణ్ పాండే, ఐ.ఎ.ఎస్ (1984, మహా రాష్ట్ర కాడర్ ) నేతృత్వం వహిస్తున్నారు. ఆయనే యు.ఐ.డి.ఎ.కు చట్టబద్ధంగా, అధికార పరంగా శిరస్సుగా వ్యవహరిస్తారు

ప్ర‌ధాన కార్యాల‌యం (HQ)

UIDAIకి డైరెక్టర్ జనరల్ అండ్ మిషన్ డైరెక్టర్ (DG & MD)గా డాక్టర్ అజయ్ భూషణ్ పాండే, ఐఏఎస్ (1984) నేతృత్వం వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో DG & MDకి ఏడుగురు డిప్యూటీ డైరెక్టర్ జనరళ్లు (DDG) సహాయకులుగా ఉంటారు. వివిధ విభాగాల ఇన్‌చార్జిలుగా భారత ప్రభుత్వంలోని సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. డి.డి.జిలకు సహాయ ఎ.డి.జిలు, డిప్యూటీ డైరెక్టర్లు, సెక్షన్ అధికారులు, సహాయ సెక్షన్ అధికారులు ఉంటారు. ప్రధాన కార్యాలయంలో గణాంక, సమాచార సాంకేతిక (IT) ఉద్యోగులు, అధికారులుసహా మొత్తం 146 మంది సిబ్బంది ఉంటారు.

ప్రాంతీయ కార్యాల‌యాలు(RO)

ఎనిమిది ప్రాంతీయ కార్యాల‌యాలలో(RO) ఒక్కొక్కదానికి ఒక్కొక్క డి.డి.జి సహాయ సిబ్బందికింద ఎ.డి.జి లు, ఢిప్యూటీ డైరెక్టర్లు, సెక్షన్ అధికారులు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, సిబ్బంది వ్యవహారాల ఉద్యోగులు (personnel) ఉంటారు.

ప్రాంతీయ కార్యాలయాల పరిధి లో వున్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల వివరములు క్రింద పొందుపరచబడ్డవి:

Regional Offices (ROs)

States and Union Territories covered by the RO

RO Bengaluru

Karnataka, Kerala, Tamil Naidu, Pondicherry, Lakshadweep

RO Chandigarh

Jammu & Kashmir, Punjab, Haryana, Himachal Pradesh and UT of Chandigarh

RO Delhi

Uttarakhand, Madhya Pradesh, Delhi and Rajasthan

RO Guwahati

Assam, Arunachal Pradesh, Meghalaya, Manipur, Nagaland, Mizoram, Tripura and Sikkim

RO Hyderabad

Andhra Pradesh, Telangana, Orissa, Chhattisgarh, Andaman and Nicobar

RO Lucknow

Uttar Pradesh

RO Mumbai

Gujarat, Maharashtra, Goa, Dadar & Nagar Haveli, Daman & Diu

RO Ranchi

Bihar, Jharkhand and West Bengal