గోప్యతా విధానము

వెబ్ సైట్ వీక్షించినపుడు డేటా సంభంధ వివరములు:

యు.ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ సాధారణంగా మీ వ్యక్తిగత సమాచారమునకు సంభందించిన, మిమ్ములను బౌతికంగా గుర్తించదానికి వీలు కల్పించే ( పేరు, ఫోన్ నెంబర్ మరియు ఈ-మెయిల్ అడ్రస్ ) మొదలగునవి సంగ్రహించదు. గణాంక వివరముల కొరకు మీరు ఎన్ని సార్లు వెబ్ సైట్ చూసారు, మీ ఐ.పి అడ్రస్, డొమైన్ పేరు, సర్వర్ చిరునామా, ఏ ముఖ్య డొమైన్ నుండి మీరు ఇంటర్నెట్ ను లింక్ అయ్యారో (ఉదాహరణకు .గువ్, .కాం, .ఇన్ మొదలగునవి), బ్రౌజరు టైపు, ఆపరేటింగ్ సిస్టం, విజిట్ చేసిన తేదీ మరియు సమయము, ఏ పేజీలు చూసారో,ఏ పత్రములు డౌన్ లోడ్ చేశారో, అండ్ అంతకు మునుపు ఏ ఇంటర్నెట్ అడ్రస్ నుండి లింక్ అయ్యారో అనే వివరములు సేకరిస్తారు. మీరు సైట్ కు హాని తలపెడితే తప్ప తప్ప ఈ పై వివరములను బట్టి మిమ్ములను గుర్తించే పని చేయము. ఒక వేళ చట్టాన్ని పరిరక్షించే ఏజెన్సీ ప్రత్యెక పరిస్థితులలో సర్వీస్ ప్రొవైడర్స్ లాగ్స్ పరిశీలించాలంటే తప్ప బ్రౌస్ చేసే వారి వివరములు సేకరించము. యు.ఐ.డి.ఎ గనుక మీ వివరములు అడిగితే, మీకు సంభందించి అన్ని రకాల, తగిన రక్షణ భద్రతా విషయములు చూసుకొని మాత్రమే అడుగుతారు. అంతే తప్ప మీరు స్వచ్చందంగా తెలియ జేసిన వ్యక్తిగత వివరములు ఎవరికీ , మూడో పార్టీకు, (పబ్లిక్/ప్రైవేటు) వారికీ అమ్మడం గాని, షేర్ చేయడం గాని యు. ఐ. డి.ఎ. ఐ చేయదు.

ఈ వెబ్ సైట్ కు’ఇచ్చిన సమాచారాన్ని ఎటువంటి లాస్ నుండి, దుర్వినియోగము నుండి, అనుమతి లేకుండా తెలపడం గాని, తారుమారు చేయడం గాని, లేక నాశనం చేయడం గాని జరుగకుoడా యు.ఐ. డి.ఎ.ఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.

కుకీలు

కుకీలు అనునవి సాఫ్ట్ వేర్ లోనీ చిన్న కోడ్ . మీరు సమాచారాన్ని చూడాలని ప్రయత్నించినపుడు ఇంటర్నెట్ వెబ్ సైట్ ఈ విషయాన్నీ బ్రౌజరుకు చేరవేస్తుంది. కాని ఈ సైట్ కుకీస్ ను ఉపయోగించదు..

ఈ-మెయిల్ ఉపయోగించడము ఎలా

మీరు మెసేజ్ పంపాలనుకుంటే కేవలము మీ ఈ-మెయిల్ అడ్రస్ మాత్రమే రికార్డు చేయబడుతుంది. ఎందుకైతే మీరు ఈ-మెయిల్ ఇచ్చారో అందుకే తప్ప మరి ఇతరత్రా వాడబడదు, మెయిలింగ్ లిస్టు లో కూడా చేర్చబడదు. మీ ఈ-మెయిల్ ఇతరత్రా వాడరు మరియు మీ అనుమతి లేకుండా ఎవ్వరికీ తెలుపరు.

వ్యక్తిగత వివరాల సేకరణ

ఒకవేళ వ్యక్తిగత వివరాలను చెప్పడానికి మీరు అంగీకరించి నట్లయితే ,మీ వివరములు ఎ విధముగా ఉపయోగిస్థారో యు.ఐ.డి.ఎ.ఐ తెలియజేస్తుంది. . ఏ సమయములోనైనా మీకు వ్యక్తిగత వివరాల సేకరణ కు సంభందించి నియమాలను, సూత్రములను పాటించడం లేదని అనుమానం వస్తే, మీకు ఈ అంశంపై సలహా ఇవ్వాలని అనిపిస్తే “కాంటాక్ట్ పేజి” ద్వారా వెబ్ మాస్టర్ కు తెలియజేయ మనవి. గమనిక:

గమనిక: వ్యక్తిగత సమాచారము అంటే మీ కనీస గుర్తింపును తెలిపే వివరములు అని , ఈ-గోప్యతా విధానము భాగము లో వదిన” వ్యక్తిగత సమాచారము “ అనే మాటకు అర్థం. వ్యక్తిగత వివరాలు సేకరించినట్లయితే వాటి భద్రతకు సంభదించి .

కనీస భద్రతా చర్యలు :

పాలనా సంభధమైన, సాంకేతిక పరమైన, ఆపరేషనల్ మరియు బౌతిక పరమైన అన్ని జాగ్రత్తలు మరియు తగిన రీతిలో భద్రతా పరమైన చర్యలు తీసుకోవడమైనది..