Biometric Devices

ఆధార్ సంఖ్యదారుల నుంచి వేలిముద్రలు/కనుపాపలు లేదా రెండింటి జీవసంబంధ సమాచారం సేకరించేందుకు బయోమెట్రిక్ పరికరాలను వినియోగిస్తాం. ఈ బయోమెట్రిక్ పరికరాలు రెండు విభాగాలుగా ఉంటాయి.

విలక్షణ పరికరాలు: ఈ రకం పరికరాలు వేలిముద్రలు/కనుపాపల సమాచారాన్ని సేకరించే వర్గంలోకి వస్తాయి. వీటిని పర్సనల్ కంప్యూటర్(PC)/ల్యాప్ టాప్/మైక్రో ఏటీఎం వంటివాటికి అనుసంధానించాల్సి ఉంటుంది.

అంతర్గత పరికరాలు: పరికర ప్యాకేజిలో భాగంగా ఫోన్ లేదా టాబ్లెట్ పీసీలలోనే ఇవి నిక్షిప్తమై ఉంటాయి. బయోమెట్రిక్ పరికరాల్లో వినియోగించే వీటి రూపస్వభావాలు:

The form factors in which biometric devices may be deployed include:

  • చేతిలోనే పనిచేసేవి/విక్రయకేంద్రాల్లోని మైక్రో ఏటీఎంలు, హాజరు నమోదుచేసేవి
  • పీసీకి అనుసంధానించిన USB పరికరం
  • జీవసంబంధ సెన్సర్ ఉన్న మొబైల్ ఫోన్
  • ఏటీఎంలవంటి కియోస్క్, ఉపాధి హామీ పథకం పని అభ్యర్థన కియోస్క్ లు.

విజ్ఞ‌ప్తి సంస్థ (AUA)లు జీవ‌సంబంధ ప‌రిక‌రాన్నిబట్టి అనువైన ప్ర‌మాణీక‌ర‌ణ ర‌కాన్ని (వేలిముద్ర/క‌నుపాప‌) ఎంచుకోవాలి. అలాగే వారి సేవ‌ల అవ‌స‌రాలు, స్వ‌భావం, లావాదేవీల ప‌రిమాణం, ఆకాంక్షిత క‌చ్చిత‌త్వ స్థాయి, సేవ‌ల విత‌ర‌ణ‌లో న‌ష్ట‌కార‌కాంశాలు త‌దిత‌రాలనూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఈ న‌మూనాల‌నేగాక OTPతో కూడిన బ‌హుళాంశ ప్ర‌మాణీక‌ర‌ణను ఎంచుకున్న త‌ర్వాత వాటిని కొనుగోలు చేసేందుకు ధ్రువీకృత బ‌యోమెట్రిక్ ప‌రిక‌ర స‌ర‌ఫ‌రాదారుల జాబితాను వెబ్‌సైట్ (హైలైట్ చేసిన లింకుద్వారా)లో చూసుకుని ఎంచుకోవ‌చ్చుభ‌ద్ర‌త స్థాయిప‌రంగా ఈ ప‌రిక‌రాల‌ను ప‌బ్లిక్‌, రిజిస్ట‌ర్డ్ ప‌రిక‌రాలుగా వ‌ర్గీక‌రించ‌బ‌డ్డాయి

“ప‌బ్లిక్ ప‌రిక‌రాలు” అంటే... ఆధార్ వ్య‌వ‌స్థ‌తో న‌మోదుకానివి....

““రిజిస్ట‌ర్డ్ ప‌రిక‌రాలు” అంటే ఆధార్ వ్య‌వ‌స్థ‌వ‌ద్ద సుర‌క్షిత ర‌హ‌స్య సంకేత నిర్వ‌హ‌ణ‌తో న‌మోదైన‌వి. ఆధార ప్ర‌మాణీక‌ర‌ణ స‌ర్వ‌ర్ వీటితోపాటు వీటి ర‌హ‌స్య సంకేత నిర్వ‌హ‌ణ‌ను విడివిడిగా గుర్తించి నిర్ధారించ‌గ‌ల‌దు. ప‌బ్లిక్ ప‌రిక‌రాల‌తో పోలిస్తే వీటికి రెండు కీల‌క అద‌న‌పు అంశాలు జోడించి ఉంటాయి.

  • ప‌రిక‌రం గుర్తింపు – భౌతిక సెన్స‌ర్‌గ‌ల ప్ర‌తి ప‌రిక‌రం విశిష్ట గుర్తింపు, ప‌రిక‌ర ప్ర‌మాణీక‌ర‌ణ‌, ఆన‌వాలుప‌ట్టే వీలు, విశ్లేష‌ణ‌, మోసాల నిరోధం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండాలి.
  • నిక్షిప్త జీవ‌సంబంధాంశాల వినియోగ నిరోధం – ప్ర‌తి జీవ‌సంబంధ రికార్డును విశ్లేషించి, సురక్షితంగా సంకేతీక‌రిస్తారు. త‌ద్వారా సుర‌క్షితం కాని జీవ‌సంబంధ వివ‌రాల‌ను సెన్స‌ర్ నుంచి ఆతిథ్య ప‌రిక‌రానికి బ‌ట్వాడా కాకుండా నిరోధించ‌డం.

జీవ‌సంబంధ స‌మాచారం కోసం గ‌ణాంక రూపం: వేలిముద్ర‌లు, క‌నుపాప‌ల జీవ‌సంబంధ స‌మాచారం ISO ప్ర‌మాణాల‌కు అనుగుణమైన రూపంలో, తాజా ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ API నిర్దేశాల‌కు త‌గిన‌ట్లు ఉండాలి.

బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాల ధ్రువీక‌ర‌ణ‌- నిర్దేశ‌కాలు

విజ్ఞ‌ప్తి సంస్థ‌లు బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసి, వాటిని త‌మ డొమైన్‌/క్ల‌యింట్ అప్లికేష‌న్‌తో సంధానించాలి. వాటిలో వినియోగించే వేలిముద్ర‌లు/క‌నుపాప‌ల స‌మాచార సేక‌ర‌ణ ప‌రిక‌రాలు UIDAI జారీచేసే తాజా నిర్దేశకాల‌కు అనుగుణంగా ఉండాలి.

భావ‌నల‌ రుజువు ప‌ద్ధ‌తి (Proof of Concepts-POC) లో UIDAI అంచ‌నా అధ్య‌య‌నాలు నిర్వ‌హిస్తుంది. ఇందులో ప‌రిక‌ర విక్ర‌య, వాస్త‌వ త‌యారీ సంస్థ‌లు (OEM) పాల్గొంటాయి. అలాగే నిర్దేశిత వ్య‌వ‌ధిలో ప‌రిక‌ర ప్ర‌మాణాల స‌వ‌రణ చేప‌డ‌తారు. ఇవి ఖ‌రార‌య్యాక వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని STQC వంటి ధ్రువీక‌ర‌ణ సంస్థలు ప‌రిక‌ర ధ్రువీక‌ర‌ణ జారీచేస్తాయి.

ఆధార్ ప్ర‌మాణీక‌ర‌ణ కోసం జీవ‌సంబంధ ప‌రిక‌రాల‌ను వినియోగించేట్ల‌యితే దిగువ పేర్కొన్న ప‌రికర నిర్దేశ‌కాల‌ను అనుస‌రించాల్సిందిగా విజ్ఞ‌ప్తి సంస్థ‌ల‌కు UIDAI సిఫార‌సు చేస్తోంది..

ప‌రిక‌ర విక్ర‌య/వాస్త‌వ త‌యారీదారులు త‌మ బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాల ధ్రువీక‌ర‌ణ కోసం STQC వంటి సంస్థ‌ల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. ఇందుకోసం పాటించాల్సిన విధివిధానాలు STQC వెబ్‌సైట్‌లో ల‌భ్య‌మ‌వుతాయి. బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాలు, అసాధార‌ణ ప‌రిస్థితుల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ త‌దిత‌రాల‌పై Aadhaar Technology &Architecture– Principles, Design, Best Practices and Key Learnings. ప‌రిశీలించ‌వ‌చ్చు.

విజ్ఞ‌ప్తి సంస్థ (AUA)లు త‌మ Sub-AUAలు/ఆప‌రేట‌ర్లు/ఏజెంట్ల‌కు UIDAI భ‌ద్ర‌త విధానానికి అనుగుణంగా శిక్ష‌ణ ఇప్పించాలి..